పోరు బాటలో..పోస్టల్ ఉద్యోగులు…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, మార్చి 28: పలు డిమాండ్ల సాధన కోసం తపాల ఉద్యోగులు పోరు బాటపట్టారు. అఖిల భారత తపాల ఉద్యోగుల సంఘం, నేషనల్ యూనియన్ పోస్టల్ ఎంప్లాయిస్ సంఘం పిలుపు మేరకు రెండ్రోజుల సమ్మెలో భాగంగా పోస్టల్ జెఏసీ ఆధ్వర్యంలో మొదటి రోజు సోమవారం కరీంనగర్ ప్రధాన తపాల శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వ విధానాలను, వైఖరిని నిరసిస్తూ తపాల ఉద్యోగులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్బంగా జేఏసీలోని సంఘాల నాయకులు మాట్లాడుతూ ఎన్పీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, జీడిఎస్ ఉద్యగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని , పోస్టల్ సంఘాలపై కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని, సాధ్యంకానీ టార్గెట్లను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. పోస్టల్ జెఎసి కన్వీనర్ రఘుమోహన్, జాయింట్ కన్వీనర్ రామచంద్రం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు ఎ.రమేష్, బి.శ్రీధర్ బాబు, ఎన్.లక్ష్మి నారాయణ, దాది మల్లేశం. ఏం.సుధాకర్, ఫజులుర్ రహమన్, అనిల్, గంగయ్య, రాజ్ కుమార్, క్రిష్ణకాంత్, అంజయ్య, శివకృష్ణ చక్రపాణి, రాజమల్లు, పవన్ కుమార్, సదయ్య, సురేశ్, సుగుణాకర్, వేణు, కే. రాజు, నసీర్ర్, శ్రీనివాస్, ప్రీత పౌల్ సింగ్, విజయ్, సత్య, శివరాం, లక్ష్మిరాజంలతో పాటు ఉద్యోగులు, గ్రామీణ తపాల ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మొదటి రోజు విజయవంతం అయిందని,
రేపు కూడా ఆందోళన కొనసాగిస్తామని జెఎసీ కన్వీనర్ రఘుమోహన్ తెలిపారు.