కరీంనగర్ లో పోస్టల్ ఉద్యోగుల ధర్నా….!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, నవంబర్ 9: తమ సమస్యల సాధనకు పోస్టల్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. అఖిల భారత తపాల ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు కరీంనగర్ డివిజన్ శాఖ ఆధ్వర్యాన ఉద్యోగులు మంగళవారం కరీంనగర్ ప్రధాన తపాల కార్యాలయం ఎదుట ఒకరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా తమ సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్బంగా సంఘం నాయకులు రమేష్, మల్లేశం. సుధాకర్ మాట్లాడుతూ కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని, జీడీఎస్ ఉద్యోగులను రెగులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, పోస్టల్ సంఘాలపై కక్ష సాధింపు చర్యలు నిలిపి వేయాలని, కోవిడ్ తో మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని,
కమలేష్చంద్ర కమిటీ సిఫార్సులను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వీటితోపాటు వివిధ రకాల సమస్యలపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎ.రాంచంద్రం, కే.రాజు, ఎల్లయ్య, డి. లచ్చయ్య, ఎ.ప్రభాకర్, యం.బాలు, యండి.ఆఫ్షర్, పి. శ్రీకాంత్, కె.రాజశేఖర్, ఇ.ఎల్లన్న, జి.సంతోష్వి, ఆనందరావు, ఎ.వంశీలతోపాటు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.