JMS News Today

For Complete News

ఇంటింటా పోస్టల్ ప్రచారం…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

బోయినపల్లి, ఆగస్టు 5: ఓ వైపు ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడం కోసం ‘హర్ ఘర్ తిరంగా’..మరోవైపు అక్కాచెల్లెళ్లు అన్నదమ్ముల అనురాగానికి ప్రతీక రక్షాబంధన్ సందర్బంగా ‘రాఖీస్ టూ జవాన్’ అనే కార్యక్రమాలతో తపాల శాఖ ముందుకు సాగుతోంది. ఈ కార్యక్రమాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. ఇందులో భాగంగా బోయినపల్లి సబ్ పోస్టు మాస్టర్ స్వామి ఆధ్వర్యంలో బోయినపల్లి మండల కేంద్రంలో శుక్రవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పీఎం స్వామి మాట్లాడుతూ తపాల శాఖ తీసుకున్న ‘హర్ ఘర్ తిరంగా’ ‘రాఖీస్ టూ జవాన్’ అనే కార్యక్రమాలపై కరీంనగర్ డివిజన్ పోస్టల్ ఎస్పీ వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సబ్ పోస్టాఫీసు పరిధిలోని బిపిఎంలు, ఎబిపిఎంలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.