JMS News Today

For Complete News

ఆ ఖాతాలను పెంచండి…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, జూలై 25: పోస్టల్ శాఖలో అందుబాటులో ఉన్న చిన్న మొత్తాల పొదుపు ఖాతాలను మరింత విస్తృత పరిచి వ్యాపారాభివృద్దికీ కృషి చేయాలని కరీంనగర్ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ వై.వెంకటేశ్వర్లు ఏజెంట్లను కోరారు. సోమవారం పోస్టల్ ఎస్పీ కరీంనగర్ లోని తన కార్యాలయంలో చిన్న మొత్తాల పొదుపు ఏజెంట్లతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చిన్న మొత్తాల పొదుపు ఖాతాలైన ఆర్డీ, సేవింగ్ తదితర ఖాతాలను అత్యధికంగా ఓపెన్ చేసి రాష్ట్రంలోనే కరీంనగర్ డివిజన్ ను ప్రథమ స్థానంలో నిలుపాలని కోరారు. శాఖపరంగా అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సమావేశంలో కరీంనగర్ పోస్టు మాస్టర్ ఎండి ఫజుల్ రహమాన్, పోస్టల్ ఏజెంట్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.