JMS News Today

For Complete News

విస్మరించడం దుర్మార్గం…

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, ఆగస్టు 30: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కృషి చేసి యావత్ తెలంగాణ ప్రజల గొంతుకై ప్రపంచానికి తెలంగాణ వాణిని వినిపించి రాష్ట్రం సిద్దించడానికి మూల కారణమైన కళాకారులను కేసీఆర్ ప్రభుత్వం విస్మరించడం దుర్మార్గమని ప్రజా నాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కన్నం లక్ష్మీ నారాయణ అన్నారు. శుక్రవారం బద్దం ఎల్లా రెడ్డి భవన్ లో తెలంగాణ ప్రజా నాట్య మండలి కరీంనగర్ జిల్లా నిర్మాణ మహాసభ దుడ్డేల సమ్మయ్య అధ్యక్షతన జరిగింది. ఈ మహా సభకు ముఖ్య అతిథిగా హాజరైన లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ కళ కళ కోసం కాదు ప్రజల కోసం అనే నినాదంతో ఆవిర్భవించిన ప్రజా నాట్య మండలి దేశ స్వాతంత్ర్య కోసం, ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం పనిచేసిందని, తెలంగాణ సాయుధ పోరాటంలో వేలాది గ్రామాల్లో వీధి భాగోతాలు, బుర్ర కథలు, తమ ఆట పాటలతో ప్రజలను చైతన్యం చేసిన కళాకారులు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విశేష కృషి చేసింది ప్రజా నాట్య మండలి అని, నాటి కళాకారులను ప్రభుత్వం ఆదుకోవడంలో విఫలం చెందినదని ఆరోపించారు. ప్రజా సమస్యలపై కళా కారులు తమ కళాలకు, గళాలకు ప్రభుత్వ పాలకులపై ఎక్కుపెట్టాలని, అందుకు జిల్లాలోని కవులు, రచయితలు, కళాకారులు, మేధావులు ముందుకు రావాలని లక్ష్మీ నారాయణ పిలుపునిచ్చారు. ఈ నిర్మాణ మహా సభలో సీపీఐ జిల్లా కో- కన్వీనర్ పోనగంటి కేదారి, ప్రజా నాట్య మండలి జిల్లా ఇంచార్జి గూడెం లక్ష్మీ, అరసం రాష్ట్ర నాయకులు కాళిదాసు, సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, బోయిని అశోక్, సత్యం గౌడ్, ప్రజా నాట్య మండలి జిల్లా నాయకులు జీల సంపత్, దుడ్డేల సమ్మయ్య, బొలుమల రాజమౌళి, అందే సంపత్, మచ్చ మహేష్, అరిగెల విజయ్, చెంచల రవి, చెంచల వెంకటస్వామి, రమేష్, రాధారపు శారద, ఎం. దిలీప్ తదితరులుపాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *