తిరుమలలో రాష్ట్రపతి కోవింద్ దంపతులు
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
తిరుమల, జూలై 13: తిరుమల శ్రీవారి దర్శనార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు తిరుపతికి చేరుకున్నారు. శనివారం రాత్రి రాష్ట్రపతితో పాటు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తిరుమలకు వచ్చారు. ఈ సందర్భంగా పద్మావతి అతిథి గృహం వద్ద కోవింద్‌కు ఈవో అనిల్ కుమార్ సింఘాల్, చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి ఘన స్వాగతం పలికారు. కాగా ఈ రాత్రికి తిరుమలలోనే రాష్ట్రపతి, గవర్నర్ బస చేయనున్నారు. ఆదివారం ఉదయం 6 గంటలకు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారిని కోవింద్, నరసింహన్ దంపతులు దర్శించుకోనున్నారు. ఈ సందర్బంగా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. అనంతరం
ఇక్కడి నుంచి రాష్ట్రపతి కోవింద్ దంపతులు నెల్లూరు శ్రీహరికోటకు వెళ్లనున్నారు.