యూరియా కోసం బారులుతీరిన రైతులు
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
జగిత్యాల, ఆగస్టు 26: యూరియా కోసం రైతులు బారులు తీరారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో జిల్లా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట సోమవారం రైతులు బారులు తీరారు. దీంతో ఆ ప్రాంతం రైతులతో నిండిపోయింది. మొక్కజొన్న, పొలాల్లో వేసేందుకు యూరియా అవసరం, యూరియా కొరత ఉండటంతో రైైతులు జిల్లా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద క్యూ కట్టారు. ఒక్కొ రైైతుకు రెండు బస్తాల చొప్పున మాత్రమే ఇస్తున్నారు. అయితే, ఎక్కువ సాగు చేేేసే రైతులకు సరిపోని పరిస్థితి నెలకొంది.