ఆయన ప్రసంగంపై అందరిలో ఆసక్తి…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
న్యూఢిల్లీ, మే 12: ప్రధాని నరేంద్ర మోడి ఇవాళ రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ గడువు ఈ నెల 17తో ముగుస్తున్న దరిమిలా సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించిన సంగతి తెలిసిందే. ఈ నెల 17 తరువాత లాక్డౌన్ను పొడిగించాలా? లేక నిబంధనలు సడలించాలా? అన్న అంశాలపై ఆయన ముఖ్యమంత్రుల అభిప్రాయాలను తీసుకున్నారు. సుమారు ఆరేడు గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో మోడీకి సీఎంలు పలు కీలక సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో తమ నిర్ణయాన్ని ప్రకటించేందుకు ప్రధాని సిద్ధమయ్యారు. ఆయన ఇవాళ రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈసారి మరిన్ని సడలింపులు ఇచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ప్రధాని మోడీ చేసే ప్రసంగంపై అందరిలో ఆసక్తి రేపు తుండగా, ఆయన ప్రసంగం ఏలా ఉండబోతోందో వేచి చూడాల్సిందే మరీ.