JMS News Today

For Complete News

వ్యభిచార గృహలపై మెరుపు దాడి

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, జూన్ 24:  కరీంనగర్ లోని కొన్ని ఇళ్లలో రహస్యంగా కొనసాగుతున్న వ్యభిచార గృహాలపై టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులు ఆదివారం రాత్రి మెరుపుదాడులు నిర్వహించారు. వ్యభిచార గృహాల నిర్వాహకులు, విటులు, మహిళలను అదుపులోకి తీసుకుని కరీంనగర్ లోని టూ టౌన్ పోలీసుస్టేషన్ లో మూడు కేసులను నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి….కరీంనగర్ నగరంలోని రైతుబజార్, కాపు వాడ, కొత్తయసువాడ, భగత్ నగర్ , ముకరంపుర , మంకమ్మతోట , సప్తగిరికాలనీ , కాన్సర్ హాస్పిటల్ ప్రాంతం , ఆదర్శనగర్ , లక్ష్మినగర్ సంతోష్ నగర్, రేకుర్తి ప్రాంతాలలో ఉన్న వ్యభిచార గృహాలపై పక్కాా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్, కరీంనగర్ టౌన్, కొత్తపల్లి స్టేషన్లకు చెందిన 50 మంది పోలీస్ సిబంది 13 టీం లుగా ఏర్పడి ఒకేసారి నిర్వాహుకుల నివాసాలపై దాడి చేసి విటులు, యువతులు (బాదితమహిళలు) అదుపులోకి తీసుకున్నారు. గోస్కుల శంకర్, శ్రీనివాస్ రెడ్డి,  నాగరాజు, రమేష్ అనే నలుగురు విటులతోపాటు, అప్రెన్, జగదీష్, భానుప్రియ, పర్వీన్ పాతిమా, స్వరూప అనే ఐదుగురు నిర్వాహకులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి15 మొబైల్ ఫోన్స్ ,1 కార్ , 1 యాక్టీవ్ , 1స్కూటీ 1 tvs బైక్ , క్యాష్ 27,760 లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారి ఫై కరీంనగర్ టూ టౌన్ లో మూడు కేసు లు నమోదు చేసారు. పట్టుబడిన బాధిత మహిళలను (సెక్స్ వర్కర్స్) ఐదుగురిని సదర్ హోమ్ కి తరలించారు. సీపీ  కమలహాసన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏసిపిలు పి.శోభన్ కుమార్ , ఎస్.శ్రీనివాస్ రావు, ఇన్స్పెక్టర్లు కె.జనార్దన్ రెడ్డి, సిహెచ్.దేవారెడ్డి, తులా శ్రీనివాస్ రావు, ఎస్ఐ నరేష్, నరసయ్య, స్పెషల్ పార్టీ, మహిళా పోలీస్ సిబ్బంది ,టాస్క్ ఫోర్స్ సిబ్బంది తదితరులు  ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *