JMS News Today

For Complete News

నూతన కలెక్టర్ బాద్యతల స్వీకరణ…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, జూలై 20: కరీంనగర్ జిల్లా నూతన కలెక్టర్ గా ఆర్.వి.కర్ణన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ కు అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, నగర పాలక సంస్థ కమిషనర్ వల్లూరి క్రాంతి, లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, ట్రైని కలెక్టర్ మయాంక్ మిట్టల్ పూల మొక్కల బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కలెక్టర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ముందుగా జిల్లా అధికారుల పరిచయ కార్యక్రమం జరిగింది. అనంతరం శాఖల వారీగా శాఖాధిపతులు వారివారి కార్యక్రమాల గురించి నూతన కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కర్ణన్ మాట్లాడుతూ ఇప్పటివరకు కలెక్టర్ శశాంక ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా చాలా అభివృద్ధి చెందిందని, జిల్లా అభివృద్ధికి అధికారులందరూ సహకరించారని, అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు అధికారులందరూ తమ సహకారాన్ని కొనసాగించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులందరూ పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులు కలెక్టర్ కు పూల మొక్కలు, బొకేలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *