చురుగ్గా రుతుపవనాలు…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జూలై 20: వానల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. శనివారం తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఇదే సమయంలో తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వారు వెల్లడించారు. దీని ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. మరోవైపు, ఏపీలోని కోస్తా జిల్లాలతో పాటు పలు చోట్ల కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. వర్షం కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.