వానల కోసం…!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 17: జూలై నెల చివరికి వస్తున్నా…వర్షాలు సకాలంలో కురియక పోవడం, వేసిన పంటలు ఎండిపోతుండడం, సాగు, త్రాగు నీటికీ ఇబ్బందులు ఏర్పడుతున్న తరుణంలో బుధవారం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల వర్షాల కోసం వరుణ యాగాలు, కప్పతల్లి ఆటలు, గ్రామ దేవతలకు జలాభిషేకాలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెెెెలిచాల గ్రామంలో గ్రామ ప్రజలు దేవతామూర్తులకు జలాభిషేకం నిర్వహించారు. కప్ప తల్లి ఆట ఆడారు. అలాగే పెగడపల్లి మండలం బతికెపల్లి గ్రామంలో వరుణ యాగం నిర్వహించారు. గ్రామ సమీపంలోని కొచ్చెరువుగుట్ట ఆంజనేయ స్వామి ఆలయంలో మహేందర్ చార్య ఆద్వర్యంలో అర్చకులు యాగాన్నీ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం పుణ్యహావచనం, రక్షా బంధనం, గణపతి, కలశపూజ, అష్టదిక్పాలక నవగ్రహ పూజలు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా సకాలంలో కురిసి పంటలు పండాలని, రైతులు సంతోషంగా ఉండాలని కోరారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.