JMS News Today

For Complete News

వానల ఎపెక్ట్…బడులు బంద్….!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, జూలై 10: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సోమ, మంగళ, బుధవారం వరకు మూడు రోజులపాటు అన్ని ప్రైవేట్, ప్రభుత్వ విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. రాష్ట్రంలో వర్షాల పరిస్థితి, చేపట్టిన చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ లో కొద్ది సేపటి క్రితం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం ప్రారంభమైంది. ఈ బేటీలో విద్యా సంస్థల సెలవులపై నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎస్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, మూడు రోజుల తరువాత వర్షాల పరిస్థితిని బట్టి విద్యా శాఖ తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published.