ఆ ఇద్దరికి రాజ్యసభ ఛాన్స్…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, మార్చి 12: తెలంగాణలోని రెండు రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలకు టిఆర్ఎస్ అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు డాక్టర్ కె.కేశవరావు, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కె.ఆర్.సురేష్ రెడ్డిలను తమ అభ్యర్థులుగా ప్రకటించారు. టిఆర్ఎస్ అభ్యర్థులిద్దరూ శుక్రవారం తమ నామినేషన్లు దాఖలు చేస్తారు. మరోసారి కేశవరావు అవకాశం ఇచ్చారు. తమను రాజ్యసభ అభ్యర్థులుగా నిర్ణయించినందుకు కేశవరావు, సురేష్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. వీరిద్దరినీ ముఖ్యమంత్రి అభినందించారు.