JMS News Today

For Complete News

భౌతిక దూరంతోనే….!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

రామడుగు, ఏప్రిల్ 9: ప్రతి ఒక్కరు భౌతిక దూరం (సోషల్ డిస్టెన్స్) పాటించినట్లయితేనే కరోనా వైరస్ వ్యాధిని అదుపు చేయవచ్చని రామడుగు ఎంపీడీవో సతీష్ కుమార్ రావు, ఎస్సై గొల్లపల్లి అనూష లు తెలిపారు. గురువారం రామడుగు మండలం వెదిర గ్రామంలో టీం – 23 గ్రూప్ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు కోడిగుడ్లు, బ్రెడ్ పాకెట్లు, టవల్స్ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీవో సతీష్ కుమార్ రావు, ఎస్సై గొల్లపల్లి అనూషా లు కార్మికులకు వీటిని పంపిణీ చేశారు. అలాగే వైద్య , విద్యుత్, రెవిన్యూ సిబ్బందికి టవల్స్ ను అందజేశారు. మండల ప్రెస్ క్లబ్ సభ్యులకు టవల్స్, చేతి రుమాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ బీరెడ్డి ప్రేమ్ సాగర్ రెడ్డి, టీం -23 గ్రూప్ అధ్యక్షుడు గాజుల ఆనందం, ఉప సర్పంచ్ సత్యనారాయణ రెడ్డి, విడిసి చైర్మన్ నాగుల రాజశేఖర్ గౌడ్ లతో పాటుగా గ్రూప్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *