ఉత్తములకు సత్కారం…!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
రామడుగు, ఆగస్టు 17: విశేష సేవలు అందించి ఆగస్టు 15న మంత్రి ఈటెల రాజేందర్, కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్న అధికారులు, ప్రజాప్రతినిధులను శనివారం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీనివాస్, మండల పశు వైద్యాధికారి సత్యనారాయణ, వెలిచాల గ్రామ సర్పంచ్ వీర్ల సరోజన, రెవెన్యూ ఇన్స్పెక్టర్ లక్ష్మన్, గోపాల్ రావుపేట వైద్యశాల స్టాఫ్ నర్స్ సోనీ కుమారి, సర్వేయర్ రాకేష్, ఏపీఓ చంద్రశేఖర్ లను ఎంపీపీ కలిగేటి కవిత, జెడ్పీటీసీ మార్కొండ లక్ష్మిలు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఎంపీపీ కలిగేటి కవిత, జెడ్పీటీసీ మర్కొండ లక్ష్మిలను తహసీల్దార్ శ్రీనివాస్, వెలిచాల సర్పంచ్ వీర్ల సరోజనలు ఈ సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు వంచ రాజిరెడ్డి, కాసారం తిరుపతి గౌడ్, ఉపాధ్యక్షులు పూరెళ్ళ రవీందర్, పణ్యాల అశోక్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి గొల్లే రామస్వామి, కోశాధికారి సంకితి తిరుపతి రెడ్డి, సలహాదారు బొల్లబతిని శ్రీనివాస్, పురాణం సంపత్, జిట్టవేణి రాజు, ఒడ్నాల గంగరాజు, శాబొద్దిన్ తదితరులు పాల్గొన్నారు.