ఆందోళనలో అపశృతి…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
వరంగల్, జూన్ 24: బీజేపీ ఆందోళనలో అపశృతి కోటుచేసుకుంది. హన్మకొండలో చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సోమవారం బీజేపీ నేతలు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డుపై కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయబోయారు. అయితే, పక్కనే పోలీసులు వారిని అడ్డకోవడం, ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగి తోపులాట జరుగుతున్న సమయంలో దిష్టిబొమ్మకు నిప్పటించారు. ఆ మంటలు కాస్తా పలువురు బీజేపీ కార్యకర్తలకు అంటుకోగా, వెంటనే అప్రమత్తమైన ఇతర కార్యకర్తలు, పోలీసులు మంటలను ఆర్పి వేయడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనలో పలువురు బీజేపీ కార్యకర్తలకు స్వల్పగాయాలయ్యాయి. శ్రీనివాస్, అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మలకు గాయాలు కాగా, వీరిని ఆస్పత్రికి తరలించారు. మరో మహిళ కార్యకర్త చీరకు నిప్పంటుకోవడంతో ఆమె స్వల్పంగా గాయపడ్డారు. కాగా తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి విషయంగా ఉన్నట్లు సమాచారం.