ఈ దారుణాలేంది….
1 min read
హైదరాబాద్: పసి పాపలపై కామాంధుల పైశాచికత్వాలు పెరుగుతున్నాయి. హన్మకొండలో 9 నెలల పసిపాపై అ త్యాచారం, హత్య ఘటన జరిగి 24 గంటలు గడవకముందే హైదరాబాద్‌లో మరో ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లోని రామాంతపూర్‌లో అభం శుభం తెలియని 9 ఏళ్ల చిన్నారిపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారం జరపడంతో ఆ చిన్నారికి తీవ్ర రక్త స్రావమైంది. దీనిని గమనించిన తల్లిదండ్రులు వెంటనే బాలికను ఆసుపత్రికి తరలించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదిఏమైనా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరం. వరుస ఘటనలతో మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు.