బాస్ బాటలో రేవంత్…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జూన్ 29: సార్వత్రిక ఎన్నికల్లో దారుణ వైఫల్యానికి బాధ్యత తీసుకుంటూ ఏఐసీసీ అధ్యక్షుడిగా తప్పుకుంటున్నట్టు రాహుల్ గాంధీ ప్రకటించడం కాంగ్రెస్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కాంగ్రెస్ పగ్గాలు మీ చేతుల్లోనే ఉండాలంటూ సీనియర్ నేతల సహా ఎవరు చెప్పినా రాహుల్ వినిపించుకోవడంలేదు. దాంతో, ఆయనంతటివాడే తప్పుకుంటున్నప్పుడు తమకెందుకు పదవులు అంటూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా ఎంపీ రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో నడిచారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. రాహుల్ గాంధీ నిర్ణయం స్ఫూర్తిగానే తాను పదవి నుంచి వైదొలగినట్టు రేవంత్ స్పష్టం చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి శనివారం మధ్యాహ్నం పంపారు. పదవిలో లేకపోయినా పార్టీని పటిష్టపరిచేందుకు తనవంతు సహకారం అందిస్తామని వివరించారు. తెలంగాణలో జరిగిన మందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున కొడంగల్ నుంచి పోటీ చేసిన రేవంత్రెడ్డి ఓటమిని చవిచూడటం, ఆ తరువాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి ఆయన ఎంపిగా గెలుపొందిన విషయం తెలిసిందే.