ఆర్డీఓ, తహశీల్దార్ లకు జైలు శిక్ష
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, ఆగస్టు 20: మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో నిర్లక్ష్యం వహించిన ఆర్డీవో, తహసీల్దార్‌కు శిక్ష విధిస్తూ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. సిద్దిపేట జిల్లా తొగుట్ట ఆర్డీవో విజేందర్‌రెడ్డి, తహసీల్దార్ ప్రభుకు 2 నెలల జైలు శిక్ష, 2 వేల జరిమానాను హైకోర్టు విధించింది. దీంతో పాటు విజేందర్‌రెడ్డి, ప్రభులపై సస్పెన్షన్ వేటు వేసింది. గతంలో భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.
హైకోర్టు ఆదేశాలను అధికారులు పట్టించుకోకపోవడంతో మరోసారి మల్లన్న సాగర్ బాధితులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు ఆర్డీఓ, తహశీల్దార్ లకు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.