ఎంపీకి రెడ్డి ల సన్మానం
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 20: అగ్ర వర్ణాల పేదల గురించి పార్లమెంట్ లో మాట్లాడిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ను రెడ్డి ఐక్య వేదిక నేతలు శనివారం శాలువ కప్పి సన్మానించారు. రెడ్డి ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఏనుగు సంతోష్ రెడ్డి విజ్ఞప్తి తో అగ్ర వర్ణ పేదలకు కేంద్ర ప్రభుత్వం కలిపించిన 10 శాతం EWS అన్ని రాష్ట్రాలు అమలు చేస్తుంటే , తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదని అమలు అయ్యే విదంగా కేంద్రం చర్యలు తీసుకోవాలని పార్లమెంట్ లో మాట్లాడిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రెడ్డి ఐక్య వేదిక నేతలు సంజయ్ ని కరీంనగర్ లో ఆయన నివాసంలో సన్మానించి, అభినందించారు. అభినందించిన వారిలో రెడ్డి ఐక్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంది తిరుపతి రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేకులపల్లి రవీందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బరాజు కేశవరెడ్డి, నాయకులు ద్యావ భాస్కర్ రెడ్డి, చింతల శ్రీనివాస్ రెడ్డి, మోతె గంగా రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, గోగురి బాపు రెడ్డి,శేఖర్ రెడ్డి, అనంత రెడ్డి, చంద్ర రెడ్డి, శ్రీధర్ రెడ్డి,పూర్ణ చందర్ తదితరులు పాల్గొన్నారు.