కరోనా కవిత….!అదేందో చదవండి
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఏప్రిల్ 29: ప్రజలు కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు గాను కవులు కవితలతో, కళాకారులు ఆట పాటలతో చైతన్యపరుస్తున్నారు. ఇందులో భాగంగానే సీతారాంపూర్ కు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయులు బెజగామ సత్యనారాయణ మూర్తి ఒక కవిత రాసారు.
కరోనా కదలిపో భువిని విడిచి పారిపో
కరోనా కదలిపో ఈ
భువిని విడచి పారిపో
చాలు నీ మారణకాండ
చాలు నీ దహనకాండ || క ||
వూహన్ లో పుట్టి నీవు
సకల దేశాలకు విస్తరించి
మహమ్మారి లాగ నీవు
మనుషుల చంపేస్తునావు || క ||
పిల్ల పాప ముసలి ముతక
అన్ని వయసుల వారందరిని
కరోనాగ్ని గుండము లో
ఆహుతి యగుచున్నారు || క ||
కనికరాన్ని చూపవమ్మ
కరోనా రోగమా
రోదనలు ఆక్రందనలు
మిన్ను ముట్టుచున్నవమ్మ || క ||
ఇకనైనా ఆగిపోయి
విశ్వశాంతి నెలకొల్పవమ్మా
విసిగిపోయి జనమంతా
వేసారిపోయి ఉన్నారు || క ||
జనులారా మేలుకోండి
విడివిడిగా మసలుకోండి
శుచి శుభ్రత పాటించి
కరోనాను తరమండి || క ||
వైద్యులు రక్షకభటులకు
పారిశుధ్య సేవకులకు
పాలకులకు సేవసంస్థలకు
దాతలకు మీకివే మా జోహార్లు || క ||