JMS News Today

For Complete News

రోడ్డు ప్రమాదంలో 12 మంది దుర్మరణం

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

చిత్తూరు, నవంబర్ 8: చిత్తూరు జిల్లాలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంగారుపాళ్యం మండలం మొగిలిఘాట్ వద్ద చిత్తూరు-బెంగళూరు నేషనల్ హైవేపై ఘటన చోటుచేసుకుంది. ఓ కంటెయినర్  దూసుకెళ్లి ఆటో, వ్యాన్, బైక్ ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఎనిమిది మంది ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం తీవ్రంగా కలచివేసింది. ఈ ప్రమాదంలో కంటెయినర్ డ్రైవర్, క్లీనర్ కూడా మృతి చెందారు. ఈ ఘటనలో మరో 10 మందికి గాయపడగా, వారిని 108 వాహనంలో పలమనేరు ఆసుపత్రికి తరలించారు. కాగా, బోల్తాపడిన కంటెయినర్ కింద ఓ బైక్ కూడా ఉన్నట్టు భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా, పోలీసు అధికారులు సందర్శించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు దర్యాప్తు లో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *