JMS News Today

For Complete News

కర్ణాటక లో విషాదం…1

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

బెంగళూరు, జూలై 3 : కర్ణాటక రాష్ట్రంలో ఓ రహదారి రక్తసిక్తమైనది. చిక్‌బళ్లాపూర్‌ జిల్లాలో ప్రైవేటు బస్సు ,టాటా ఏస్‌ను ఢీ కొన్న ఘోర దుర్గటనలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడటంతో వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. చింతామణి నుంచి మురుగుమల్ల వెళ్లే మార్గంలో బుధవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన కలకలం రేపింది. ప్రమాదస్థలికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *