మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర విషాదం
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
మహబూబ్ నగర్, ఆగస్టు 4: మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. జిల్లాలో కొత్తపల్లి శివారు వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి చెందారు.12మంది అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న ఆయన వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా ఏర్పాట్లు చేయాలంటూ అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. కాగా, మృతుల బంధువులు ఘటనస్థలి వద్ద మృతదేహాలతో ఆందోళనకు దిగారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని కలెక్టర్ వచ్చి హామీ ఇస్తేనే తాము మృతదేహాలను అప్పగిస్తామని స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ రమా రాజేశ్వరి పర్యవేక్షిస్తున్నారు. కేేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు