JMS News Today

For Complete News

‘చితి’కిపోతున్న వలస బతుకులు….!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

ఉత్తరప్రదేశ్, మే 16: వలస కూలీలపై విధి పగబట్టింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో సొంతూళ్ళకు వెళుతున్న వలస కార్మికులు ఇంటికి వెళ్ళకుండానే మార్గ మధ్యంలోనే కనిపించని లోకాలకు వెళుతున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పదుల సంఖ్యలో వలస కార్మికులు మృత్యువాత పడటం అందరిని కలచివేయగా, తాజాగా శనివారం ఉదయం మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ హృదయ విదారక ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. శనివారం ఉదయం వలస కూలీలతో వెళ్తున్న ట్రక్కును మరో ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 21 మంది వలస కూలీలు దుర్మరణం చెందారని సమాచారం. అలాగే పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వలస కూలీలు వెళ్తున్న ట్రక్కు రాజస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్ కు వెళోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు దర్యాప్తు లో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *