ఆపద బండి అదుపుతప్పింది….!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
రంగారెడ్డి, ఆగస్టు 19: ఆపద సమయాల్లో బాధితులను తీసుకెళ్లే (అంబులెన్స్) బండి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి హుస్సేన్ పూర్ కూడలి వద్ద సోమవారం వేకువ జామున చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన అంబులెన్స్ అదుపుతప్పి బోల్తా పడగా, వృద్ధురాలైన మహిళా మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.