రోడ్డు ప్రమాదంలో ఎఎస్ఐ మృతి
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూన్ 17: రోడ్డు ప్రమాదంలో ఓ ఏఎస్ఐ మృతి చెందారు. సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ తిరుపతి రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. మంగళవారం రాత్రి విధులు ముగించుకుని కారులో కరీంనగర్ వస్తుండగా, కరీంనగర్ శివారు గుంటూరుపల్లి వద్ద లారీని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కరీంనగర్ లోని విద్యానగర్ లో నివసిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గతంలో తిరుపతి ఎస్ఐ గా పదోన్నతి పొంది కొన్ని రోజుల తరువాత తిరిగి ఏఎస్ఐ గా రివర్షన్ ప్రమోట్ అయ్యారు.