విటంరాజుపల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురి దుర్మరణం
1 min read
గుంటూరు: గుంటూరు జిల్లా వినుకొండ మండలం విటంరాజుపల్లె వద్ద శుక్రవారం తెల్లవారుజామున వేగంగా వెళుతున్న స్కార్పియో వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. విశాఖ జిల్లాకు చెందిన ప్రవీణ్‌కుమార్, రామకృష్ణ, వెంకటేశ్, కుమారస్వామి లు కలసి స్కార్పియోలో ప్రకాశం జిల్లా మార్కాపురం వైపు వెళుతున్నారు. విటంరాజుపల్లె వద్దకు చేరుకునే సరికి వీరి వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రవీణ్‌కుమార్, రామకృష్ణ, వెంకటేశ్‌లు అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన కుమారస్వామిని చికిత్స నిమిత్తం గుంటూరు ఆసుపత్రికి తరలించారు. వినుకొండ సీఐ ఎం.సుబ్బారావు ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.