JMS News Today

For Complete News

ఓ వైపు పెళ్ళి జరుగుతోంది…అంతలోనే

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

హైదరాబాద్, జూలై 11: రోడ్డు పక్కన ఓ పెళ్ళి జరుగుతోంది. అందరూ పెళ్ళి వేడుకలను తిలకిస్తున్నారు. ఇంతలో ఓ పెద్ద శబ్దం. వెంటనే హాహాకారాలు, అర్థనాదాలు. క్షణాల్లో పెళ్ళి మండపం రక్తసిక్తమైంది. ఈ హృదయ విదారక ఘటన బీహార్ రాష్ట్రంలో గురువారం చోటుచేసుకుంది. బీహార్ రాష్ట్రంలో ని లఖీసరాయ్ లో ఓ ట్రక్కు అదుపుతప్పి రోడ్డు పక్కన పెళ్ళి జరుగుతున్న మండపం లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడగా, సుమారు ఇరవై మంది వరకు స్వల్పంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రక్కు డ్రైవర్ పారి పోయాడు. ఈ ఘటన స్థానికంగా విషాదం నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *