పాలకొల్లు కు వెళ్తూ…పరలోకానికి
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
గుంటూరు, జూలై 1: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారు జామున జాతీయ రహదారిపై జరిగిన ఘోర ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి నుండి దైవ దర్శనం చేసుకొని పాలకొల్లుకు 11 మంది భక్తులతో వెెెెళ్తున్న ఫార్చ్యూన్ వాహనం ఆగి ఉన్న లారీని శరవేగంతో ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు సంఘటనా స్థలంలో మరణించారు. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఆరుగుర్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికిి చికిత్స నిమిత్తం తరలించారు. వాహనంలో డ్రైవరు ఇరుక్కుపోవడంతో జెసిబి సాయంతో బయటకు తీసి రక్షించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం సబ్బు వారి పాలెం గ్రామానికి చెందిన వీరంతా ఫోటోగ్రఫీ వర్క్ చేసుకుంటూ ఇరు కుటుంబాలు తిరుపతి దైవ దర్శనం నిమిత్తం వెళ్లి వస్తుండగా ఈ ఘోర సంఘటన జరిగింది. నరసరావుపేట డిఎస్పి రామ వర్మ హుటాహుటిన చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన వారిలో సూర్య భవాని (22), వెంకట్ (30), గీతేశ్వరి బాబు (4), సోనాక్షి (5), మనోజ్ (22) ఉన్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.