కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఫిబ్రవరి 9: కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల వద్ద గ్రానైట్ లారీ టాటా ఏసీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఈ హృదయ విదారక ఘటన శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మేక బాబు, మేక నర్సయ్య, గడ్డం అంజయ్య, మేక శేఖర్ తోపాటు మరోకరు మృతి చెందారు. కరీంనగర్ నుంచి పూడూరు వెళుతున్న టాటా ఏసీని, గంగాధర నుంచి కరీంనగర్ వస్తున్న గ్రానైట్ లారీ ఢీకొన్నది. మృతుల్లో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా, వీరిది పూడూరు గ్రామం. మిగితా ఇద్దరు గౌరరానికి చెందినవారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.