JMS News Today

For Complete News

మరికాసేపట్లో ఇంటికి…అంతలోనే…

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కేరళ, జూన్ 29: కేరళలో  తీరని విషాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని ఓమ్నీ కారు ఢీ కొట్టడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన ఓ కుటుంబం కేరళలోని వలయార్‌కు వెళుతుండగా పాలక్కాడ్ జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మరికాసేపట్లో గమ్యస్థానం చేరుకునే సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులతో పాటు ఓ మహిళ, వ్యాన్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన పాలక్కడ్ ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *