అక్కడ ఘోర దుర్ఘటన జరిగింది…!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే,కామ్)
రంగారెడ్డి, జూలై 8: రంగారెడ్డి జిల్లా
ఆమనగల్ పట్టణ సమీపంలోని కల్వకుర్తి-హైదరాబాద్ ప్రధాన రహదారి మేడిగడ్డ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి… వరంగల్ జిల్లా కాజీపేట మండలం మట్టెవాడ పిఎస్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న దుర్గ ప్రసాద్ కుటుంబం తో కలిసి శ్రీశైలం దైవ దర్శనం చేసుకొని ఇన్నోవా వాహనం లో తిరిగి వస్తుండగా, మేడిగడ్డ గ్రామ సమీపంలో గణపతి వేబ్రిడ్జ్ కి కాంట కోసం లారీ టర్న్ అవుతుండగా, ఈ ప్రమాదం జరిగింది. ఇన్నోవా లో ఉన్న ఐదుగురు మృతి చెందారు. దుర్గ ప్రసాద్, అతని భార్యా విజయలక్ష్మి, కొడుకు శాంతన్, దుర్గ ప్రసాద్ బావ రాజు, అక్క అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ ఖలీల్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.