ఘోర రోడ్డు ప్రమాదం…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జనవరి 30: తెల్లవారుజామునే మా బతుకులు తెల్లారిపోతాయని వారు అనుకోలేదు. ఓ కారు మృత్యు శకటమై వారి ప్రాణాలను బలికొంది. ఫుట్ పాత్ పై నివసిస్తున్న తొమ్మిది మందిపై నుంచి కారు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డాడు. ఇందులో ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉంది. ఈ హృదయ విధారక ఘటన కరీంనగర్ నగరంలోని కమాన్ సమీపంలో ఆదివారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. కాగా, రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి బంధువులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. తమ వారిని చంపిన కారు డ్రైవర్ ను అప్పగించాలని డిమాండ్ చేశారు. మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ వచ్చి మమ్ములను ఆదుకునేందుకు హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.