ప్రమాద నివారణ కు మహిళా డాక్టరు చేయూత
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 3: కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా ఇప్పటికే రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకొంటున్నామని పోలీసు కమీషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి చెప్పారు. జిల్లాలో ని ప్రధాన రహదారులపై దృష్టి సారించామని, మూడు హైవే పెట్రోలింగ్ వాహనాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రమాద జోన్ లను గుర్తించేందుకు చర్యలు చేపట్టామని, ఇందులో ప్రైవేట్ సంస్థ ల భాగస్వామ్యం తో ప్రమాద నివారణ చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఇందులో భాగంగానే ఐఎంఏ ముందుకు వచ్చిందని, ఇందుకోసం ప్రముఖ డాక్టర్ గీతారెడ్డి రూ.3లక్షల విరాళం అందించారని తెెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ గీతారెడ్డి కి సిపీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా డాాక్టర్ గీతారెడ్డి మాట్లాడుతూ సమాజ సేవ లో పాలు పంచుకోవాలని నిర్ణయించుకుని, ఇప్పటికే ఐఎంఏ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాల్లో పాలు పంచుకున్నట్లు వివరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు మా వంతు సహాయంగా ఈ సహాయం చేేేేసినట్లు చెప్పారు. ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకోవాలని, అప్పుడే ప్రమాదాల నివారణ సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి శ్రీనివాస్, ట్రాఫిక్ ఎసిపి ప్రసాద రావు, సిఐలు సీతా రెడ్డి, తిరుమల్, ఐఎంఏ ప్రతినిధులు పొలాాడి శ్రీనివాస రావు, బి.ఎన్. రావు తదితరులు పాల్గొన్నారు.