ప్రైవేట్ బస్సు బోల్తా: పలువురికి గాయాలు
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కామారెడ్డి, మార్చి 6: కామారెడ్డి జిల్లాసదాశివనగర్ మండలం మల్లు పేట్ వద్ద శుక్రవారం ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 12 మంది పెద్దలకు, 8మంది పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. హైదరాబాద్ నుండి బాసరకు వెళుతుండగా, మార్గమధ్యంలో కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మల్లుపేట వద్ద టైర్ పేలి బోల్తా పడింది. క్షతగాత్రులను కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు దర్యాప్తు లో ఉంది.