JMS News Today

For Complete News

బోలెరో వాహనం బోల్తా: పలువురికి గాయాలు

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కాటారం, ఆగస్టు 16: ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి బొలెరో వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురికాగా, బొలెరో ప్రయాణిస్తున్న 11 మంది గాయపడ్డారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో అటవీ శాఖ తనిఖీ కేంద్రం సమీపంలో శుక్రవారం రాత్రి జరిగింది. కాలేశ్వరం ప్రాజెక్టు సందర్శించి తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాధితులు రేగొండ మండలం నిజాంపల్లి గ్రామస్తులుగా గుర్తించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కేసు దర్యాప్తులో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *