JMS News Today

For Complete News

అవుటర్ రింగు రోడ్డు లో ప్రమాదం

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

హైదరాబాద్, జూలై 4:  హైదరాబాద్ అవుటర్ రింగు రోడ్డు లో ఓ గూడ్స్ వాహనం టైర్ పేలి ప్రమాదం జరిగింది.  ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా,  11మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదాన్ని గమనించిన వాహనదారులు గాయాలపాలైన వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా.. ఈ ప్రమాదంలో చనిపోయింది ఎవరు..? గాయపడిందెవరు..? ఏ ప్రాంతానికి చెందిన వారు..? అనే విషయాలు తెలియరాలేదు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *