జాతీయ రహదారిపై బస్సు బోల్తా…
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
సూర్యాపేట, సెప్టెంబర్ 26: సూర్యాపేట జిల్లా
విజయవాడ -హైదరాబాద్ జాతీయ రహదారి (NH-65) పై గురువారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన (AP 02 TC 7695) బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తుండగా, సూర్యాపేట పరిధిలోని దూరజ్ పల్లి వద్ద డివైడర్ ను డీ కొట్టి పల్టీ కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 49 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అందులో 10 కి గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
స్థానికుల సహాయంతో పోలీసులు ప్రమాదంలో గాయపడిన వారిని108 ద్వారా స్థానిక ఆసుపత్రిలకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు దర్యాప్తు లో ఉంది.