ఘోర బస్సు ప్రమాదం…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
ఉత్తరప్రదేశ్, జూలై 8: లక్నో నుంచి ఢిల్లీ వైపు కు వెళ్తున్న ఓ బస్సు ఆగ్రా- లక్నో జాతీయ రహదారిపై వంతెన పై నుంచి కింద పడి పోయింది. ఈ ఘోర ప్రమాదంలో 29 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ హృదయ విదారక ఘటన ఉత్తర ప్రదేశ్ లో సోమవారం ఉదయం జరిగింది. గాయపడిన వారిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. బస్సులో 50మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం. ఘటన స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.