JMS News Today

For Complete News

ఆ జాతీయ రహదారి రక్తసిక్తం…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

మహారాష్ట్ర, జూలై 20 : పని ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తున్న తొమ్మిది మంది తిరిగిరానిలోకాలకు వెళ్లారు. ఈ హృదయ విదారక ఘటన మహారాష్ట్ర లోని పుణె నగర శివారులో జాతీయ రహదారిపై శనివారం వేకువజామున చోటుచేసుకుంది. పుణె- షోలాపూర్‌ జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న ఓ లారీ కదంవక్‌ వాస్తి గ్రామ సమీపాన ఎదురుగా వస్తున్న కారును ఢీ కొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న 9 మంది అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మృతులంతా పుణె నగర సమీపంలోని యవత్‌ గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇంటికి వెళ్తూ తిరిగిరాని లోకాలకు వెళ్లడం విషాదం నింపింది. మృతుల కుటుంబాల్లో తీరని విషాదఛాయలు అలుముకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *