రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, అక్టోబర్ 3: కరీంనగర్ -జగిత్యాల ప్రధాన రహదారిపై గంగాధర ఎక్స్ రోడ్ లో గురువారం ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తిప్పాయపల్లి గ్రామానికి చెందిన ఆకునూరి మల్లయ్య (60) అనే వ్యక్తి మృతి చెందాడు. మల్లయ్య తన వాహనం హీరో హోండా స్ప్లెండర్ (AP15BB9347) పై వెళ్తుండగా, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వెళుతున్న జగిత్యాల డిపోకు ఆర్టీసీ బస్సు నంబర్ (TS 21Z0042) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.