అదుపుతప్పింది..ఓ ప్రాణం పోయింది
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జూలై 28: ఓ వాహనం అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. ఈ ఘటన నగరంలోని బేగంపేటలో ఆదివారం చోటుచేసుకుంది. డ్రైవర్‌కు మూర్చ రావడంతో వాహనం అదుపుతప్పి ముందున్న పది వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ప్రభాకర్ అనే ట్రాఫిక్ హోంగార్డు గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందారు. హోంగార్డు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇటీవలే బదిలీపై బేగంపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి విధులు నిర్వహిస్తున్న ప్రభాకర్.. విధి నిర్వహణలో భాగంగా ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.