మానేర్ వంతెనపై నుంచి కింద పడ్డ కారు
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఫిబ్రవరి 16: కరీంనగర్ శివారు మానేర్ వంతెనపై ప్రమాదం జరిగింది. లారీ ఢీకొన్న ప్రమాదంలో మానేరు వంతెనపై నుంచి కారు కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. కారులో ముగ్గురు ప్రయాణీస్తున్నట్లు సమాచారం. కింద పడ్డ కారును బ్రిడ్జి మీద నుంచి పరిశీలిస్తున్న కానిస్టేబుల్ కింద పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు దర్యాప్తు లో ఉంది.