కరీంనగర్ లో రోడ్డు ప్రమాదం
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఆగస్టు 5: నగరంలోని కట్ట రాంపూర్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన కర్ర శ్రీనివాసరావు (43) అనే వ్యక్తి మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం ఎల్ఐసి ఏజెంట్ గా పనిచేస్తూ కరీంనగర్లోని కోతి రాంపూర్ లో తన భార్య పిల్లలతో కలిసి శ్రీనివాస్ నివసిస్తున్నాడు. తన పిల్లలు ఒక ప్రైవేటు పాఠశాలలో చదువుతుండగా, వారిని స్కూల్ నుండి తీసుకువచ్చేేందుకు తన (AP -15 R/ 3077) అనే హీరో హోండా స్పెండర్ పై కట్టరాంపూర్ రోడ్డులో వెళ్తుండగా, గౌతమి నగర్ సమీపంలో ఎదురుగా వస్తున్న (TS-02-UC/ 3751) అనే నెంబర్ గల ప్రైవేట్ పాఠశాల డ్రైవర్ నిర్లక్ష్యంగా బైక్ ను ఢీ కొట్టడంతో శ్రీనివాస రావు అక్కడికక్కడే మృతి చెందారు. వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.