ఆర్టీసీ బస్సు -ఇసుక లారీ ఢీ…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
భూపాలపల్లి, జూలై 26: ఆర్టీసీ బస్సు -ఇసుక లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్-కాళేశ్వరం రహదారిలో అన్నారం మలుపు వద్ద శుక్రవారం జరిగింది. మృతుడిని చేల్పూరు వాసి పనగంటి సమ్మయ్య(40)గా గుర్తించారు. గాయపడిన వారిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.