రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
రామడుగు, సెప్టెంబర్ 24: కరీంనగర్ జగిత్యాల ప్రధాన రహదారిపై రామడుగు మండలం దేశరాజుపల్లి బస్టాండ్ సమీపాన సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో కొత్తపల్లి మండలం నాగుల మల్యాల గ్రామానికి చెందిన గొర్రె అజయ్ కుమార్ (28) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు దర్యాప్తులో ఉంది.