అక్కడ ప్రమాదం..కరీంనగర్ లో విషాదం…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఆగస్టు 9: ప్రకాశం జిల్లా గుడ్లూర్ మండలం మాచర్ల వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కరీంనగర్ నగరానికి చెందిన ఆరుగురు దుర్మరణం చెందారు. నగరంలోని సంతోష్ నగర్ కు చెందిన రిటైర్డ్ కోర్టు ఉద్యోగి మల్హర్ రావు (65), అతని భార్య లీల, కూతురు అర్చన, అల్లుడు వంశీకృష్ణ, ఇద్దరు మనవళ్లు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. సంతోష్ నగర్ కు చెందిన మల్హర్ రావు కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతికి వెళ్లేందుకు ట్రైన్ టికెట్ కూడా బుక్ చేసుకున్నారు. ఆ తరువాత ఏమైందో ఏమో తెలియదు కానీ శుక్రవారం ఉదయం కారులో తిరుపతి కి బయలుదేరారు. ప్రకాశం జిల్లా మాచర్ల వద్దకు రాగానే ఆగి ఉన్న లారికీ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడేే మృతి చెందగా, ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన సమాచారం అందుకున్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ వెంటనే ఒంగోలు ఎంపీ శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడారు. పోస్టుమార్టం త్వరగా నిర్వహించి, మృతదేహాలను తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు. దైవదర్శనానికి వెళుతూ ప్రకాశం జిల్లా మాచర్ల వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జిల్లా వాసులకు సంజయ్ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు తన సానుభూతి ప్రకటించారు.ఈ ఘటన సంతోష్ నగర్ లో కలకలం రేపగా, మృతుల కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది.