JMS News Today

For Complete News

ఘోర ప్రమాదం: పది మంది మృతి

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

తూర్పు గోదావరి, అక్టోబర్ 15: ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి, చింతూరు మధ్య ఘాట్ రోడ్డులోని వాల్మీకి కొండ వద్ద బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందారు. మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది గాయాలపాలైన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. బస్సు మారేడుమిల్లి నుంచి బయలుదేరి వెళుతుండగా, ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు దర్యాప్తు లో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *